కళ్యాణ్ జొడీగా రియా చ‌క్ర‌వ‌ర్తి

వాస్తవం సినిమా: చిరంజీవి చిన్న అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. జూలై 12, 2018న విడుద‌లైన ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించినా, వ‌సూళ్ల విష‌యంలో అనుకొన్నంతగా రాబట్టలేకపోయింది. దీంతో త‌దుప‌రి విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు క‌ళ్యాణ్‌. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో క‌ళ్యాణ్ త‌న రెండో సినిమా చేయ‌నుండ‌గా, ఈ సినిమాని పులి వాసు తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ చిత్రంతో వాసు ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.

.సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళీ, ప్రగతి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నారు. అయితే చిత్రంలో క‌ళ్యాణ్ కి జోడీగా తూనీగ తూనీగ ఫేం రియా చ‌క్ర‌వ‌ర్తిని ఎంపిక చేశార‌ట. రియా హిందీలో ‘‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్, బ్యాంక్ చోర్, జలేబి’’ సినిమాలతో యూత్‌కి బాగా చేరువైంది. మ‌రి త్వ‌ర‌లోనే ఇందికు సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వెలువడనుంది.