కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన కేరళ సి ఎం

వాస్తవం ప్రతినిధి: అగ్ర‌కులాల్లో ఆర్థికంగా వెనుక‌బ‌డిన వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం పై విపక్షాలు పలు విమర్సలకు దిగుతున్నారు. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ మాత్రం స్వాగ‌తించారు. ఎన్నో ఏళ్లుగా సీపీఎం పార్టీ దీన్ని డిమాండ్ చేస్తోంద‌న్నారు. రిజ‌ర్వేష‌న్ వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నించార‌ని, కానీ అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుక‌బ‌డిన వారికి రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డం స‌ముచిత‌మైన నిర్ణ‌య‌మ‌న్నారు. ఎట్ట‌కేల‌కు రిజ‌ర్వేష‌న్‌పై నిర్ణ‌యం తీసుకున్నార‌ని, ఇది స్వాగ‌తించ‌ద‌గ్గ‌ ప‌రిణామం అని సీఎం విజ‌య‌న్ తెలిపారు. జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా కూడా ఈ అంశంపై స్పందించారు. రిజ‌ర్వేష‌న్ల నిర్ణ‌యంతో మోదీ ఎన్నిక‌ల న‌గారా మోగించార‌ని ఒమ‌ర్ ట్వీట్ చేశారు.