తెలంగాణా శాసన సభ,శాసనమండలి సమావేశాలకు నోటిఫికేషన్ జారీ

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈనెల 17న ఉదయం 11.30 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అలాగే ఈనెల 19న ఉదయం 11.30 గంటలకు మండలి సమావేశం ప్రారంభమవుతుందని నోటిఫికేషన్ ద్వారా తెలిపారు. ఈనెల 19న ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది.