మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష

వాస్తవం ప్రతినిధి: తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి బాలకృష్ణారెడ్డికి మూడేళ్ల జైలుశిక్ష పడినట్లు తెలుస్తుంది. రాళ్లు రువ్విన కేసులో బాలకృష్ణారెడ్డికి చెన్నై ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 1998లో హోసూరులో బస్సులపై రాళ్లు రువ్విన కేసులో కోర్టు ఇవాళ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కోర్టు తీర్పుతో బాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే, మంత్రి పదవి కోల్పోనున్నట్లు తెలుస్తుంది.