బాబు ,జగన్ లకి పవన్ అంటే ఎందుకంత భయం..???

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన నాటి మొదలు..సీనియర్స్ అంటూ జబ్బలు చరుచుకునే బాబు , జగన్ లు పవన్ టార్గెట్ గా విమర్శలు ఎక్కు పెట్టారు. గతంలో చంద్రబాబు పవన్ మద్దతుతో అధికారంలోకి వచ్చానని మరిచి మరీ ఆయన బ్యాచ్ తో విమర్శలు చేయిస్తూ చివరికి బాబు కూడా విమర్శలు చేస్తూ ,ఫైనల్ గా పవన్ కావాలి అంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇక జగన్ విషయానికి వస్తే గతంలో పవన్ కళ్యాణ్ తో పొత్తు దొరుకుతుందని పవన్ ని ఒక్క మాట కూడా అనకుండా, టీడీపీ, పవన్ పై కామెంట్స్ కి రోజా తో కౌంటర్ కూడా ఇప్పించారు..

అయితే ఒక్క సారిగా గత కొంతకాలంగా వైసీపీ పార్టీ పవన్ పై మాటల యుద్ధం మొదలు పెట్టింది…అసలు పవన్ పై ఇప్పుడు రెండు సీనియర్ మోస్ట్ పార్టీలు ఎందుకు ఈ విధంగా విరుచుకు పడుతున్నాయి..?? ఈ పరిణామాలకి కారణం ఏమిటి..?? పవన్ అంటే ఇంట ఉలుకెందుకు..?? అనే వివరాలలోకి వెళ్తే..షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..అందుకే జగన్ ,బాబు లు ఇద్దరూ పవన్ విషయంలో రూటు మార్చారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ అంటే బాబు , జగన్ లకి భయమని అందుకే పవన్ పై విమర్శలు చేస్తున్నారని గతంలో ఎన్నో సార్లు జనసేన నేతలు మీడియా సమావేశంలో వెల్లడించారు. దానికి బదులుగా ఆ పార్టీ నేతలు కూడా ఘాటుగా స్పందించారు..మాకు ఎందుకు భయం అంటూ ఎదురు దాడి చేశారు. మరి భయం లేనపుడు పవన్ పై ప్రతీ రోజు విమర్శలు ఎందుకు…పవన్ అంటే భయం లేనపుడు బాబు తనతో మళ్ళీ జట్టు కట్టమని ఎందుకు ఆహ్వానం అందిస్తారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే..??

పవన్ కళ్యాణ్ బలమెంత..?? పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత అంటూ బాబు తన ఇంటిలిజెన్స్ తో సర్వే చేయించుకున్నారట..అలాగే జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ కి గతంలోనే ఈ భాద్యత అప్పగించారట. దాంతో ఇద్దరూ తమకి అందిన రిపోర్ట్స్ చూసి నోళ్ళు వెళ్ళబెట్టారని తెలుస్తోంది. ఆ సర్వే రిపోర్ట్స్ లో ఉభయగోదావరి జిల్లా, అలాగే ఉత్తరాంధ్ర లో పవన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని. అలాగే మిగిలిన జిల్లాలలో సైతం జనసేన కొన్ని నియోజకవర్గాలలో జనసేన జెండా ఎగరడం ఖాయమని తేలిందట దాంతో..’

ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేలోగా పవన్ ప్రభావాన్ని తగ్గించాలని జగన్..ఎటూ దారి లేదు కాబట్టి పవన్ ని బ్రతిమిలాడుకునైనా సరే పొత్తు కుదుర్చుకోవాలని బాబు తమ రూట్లు మార్పు చేసుకున్నారని రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరి నేతల ప్రవర్తన కారణంగా పవన్ కి ప్రజలలో మరింత ఆదరణ పెరుగుతోందని, పవన్ ముందు నుంచీ ఎలాంటి వైఖరిని అవలంబిస్తున్నాడో ఇప్పటికి స్వభావంతోనే ఉన్నాడనే ఆలోచన ప్రజలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇద్దరి సీనియర్ నేతల్లో వచ్చిన ఈ మార్పు..పవన్ కి కలిసొస్తోందని అంటున్నారు విశ్లేషకులు.