రక్షణ మంత్రి అసత్యాలు చెప్పారు: రాహుల్

వాస్తవం ప్రతినిధి: కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ పార్ల‌మెంట్‌లో అస‌త్యాలు చెప్పారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ‌కు ల‌క్ష కోట్లు ఇచిన‌ట్లు ర‌క్ష‌ణ మంత్రి చెప్పారు. దాన్ని మేం స‌వాల్ చేశాం, అయితే ఆ అంశాన్ని ఈ రోజు ఆమె మ‌రోలా చెప్పార‌ని, హెచ్ఏఎల్‌కు కేవ‌లం 26 వేల కోట్లు ఇచ్చిన‌ట్లు సీతారామ‌న్ పార్ల‌మెంట్‌లో తెలిపారు. అయితే ఈ అంశాన్ని లేవ‌నెత్తుతూ రాహుల్‌.. ర‌క్ష‌ణ మంత్రిపై ఫైర్ అయ్యారు. రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు స‌మ‌యంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ఎయిర్‌ఫోర్స్‌, ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ సీనియ‌ర్ అధికారులు అడ్డుకున్నారా లేదా అన్న విష‌యాన్ని కూడా చెప్పాల‌ని రాహుల్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.