ప్రధాని అభ్యర్ధిగా రేసులో నితీష్ కూడా!

వాస్తవం ప్రతినిధి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఎ తరపున ప్రధాని అభ్యర్థిగా తమ పార్టీ అధినేత, బిహార్‌ సి ఎం నితీష్ కుమార్ కూడా రేసులో ఉంటారని జేడీ(యూ) స్పష్టం చేసింది. రాజకీయాల్లో నితీష్‌ కెరీర్‌ స్ఫూర్తివంతంగా సాగిందని, బిహార్‌ను ఒంటిచేత్తో అభివృద్ధిపథంలో నిలిపి దేశానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారని జేడీ(యూ) ప్రతినిధి రాజీవ్‌ రంజన్‌ ఆదివారం పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ఎన్డీఏలో సవాల్‌ ఎదురవుతున్నట్టు ఆ పార్టీ సంకేతాలు పంపింది. ఎన్డీఏ నేతగా ప్రధాని మోదీ నిలిచినప్పటికీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధి చర్చకు వస్తే నితీష్‌ కుమార్‌ సైతం ప్రదాని రేసులో ఉంటారని రంజన్‌ వెల్లడించారు.