టీడీపీ సిట్టింగ్ ల గుండెల్లో రైళ్ళు..ఎందుకంటే..??

వాస్తవం ప్రతినిది: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పీడు పెంచారు. వ్యూహాత్మక నిర్ణయాలని అమలు చేస్తున్నారు. ఎలాగో జనసేనతో పొత్తు లేదు కాబట్టి ఇక ఒంటరి పోరుకి సిద్దం అయిన చంద్రబాబు అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. మిగిలిన పార్టీల సంగతేమో కాని వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయనున్నారనే మొదటి జాబితా ని సిద్దం చేశారు. దాంతో సిట్టింగు ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు మొదలయ్యిందనే టాక్ వినిపిస్తోంది.

గడిచిన రెండు నెలల కాలంగానే ఈ అభ్యర్ధుల మొదటి జాబితాపై కసరత్తులు మొదలయ్యాయని. తాజా నివేదికలు ఆధారంగా, గత నివేదికలని క్రోడీకరించుకుని అభ్యర్ధుల స్థానాలని డిసైడ్ చేశారని తెలుస్తోంది. అయితే బాబు రిలీజ్ చేయబోయే ఫస్ట్ లిస్టు లో ఎవరెవరు ఉన్నారు..?? సీనియర్ నేతలకి ఈ తొలి జాబితాలో చోటు దక్కుతోందా..?? కాంగ్రెస్ తో బాబు పొత్తు పెట్టుకుంటారా అనేది అతి త్వరలో తెలిపోనుందట అంతేకాదు మొదటి జాబితా రిలీజ్ అయ్యేది కూడా డిసైడ్ చేశారట..ఆ వివరాలలోకి వెళ్తే..

చంద్రబాబు నాయుడు జనవరిలోనే తొలి జాబితా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ఆ పార్టీ వర్గాలు గతంలో తెలిపాయి.కాని కొన్ని అనివార్య కారణాల కారణంగా ఈ ముహూర్తం మారిందని. ఫిబ్రవరి మొదటి వారంలోనే అభ్యర్ధుల జాబితా బాబు ప్రకటించనున్నారని తెలుస్తోంది. అమరావతిలో నిర్వహించే భారీ భహిరంగ సభ తరువాత అభ్యర్ధుల పేర్లు ప్రకటన ఉంటుందని అంటున్నారు. జనవరి లో ఎన్నో కార్యక్రమాలు వరుసగా ఉండటమే ఈ వాయిదాకి కారణమని తెలుస్తోంది.ఇదిలాఉంటే…

రోజు రోజు కి తెలుగు దేశం ఎమ్మెల్యేల కి బాబు ప్రకటనపై గుబులు రేపుతోందట. బాబు గతంలో వార్నింగ్ లు ఇచ్చిన అభ్యర్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని. ఇక సీనియర్స్ పరిస్థితి అయితే చెప్పనవసరం లేదని అంటున్నాయి పార్టీ వర్గాలు. బాబు ప్రకటన కోసం ప్రతిపక్ష పార్టీల కంటే కూడా సొంత పార్టీ నేతల్లో మరింత ఆత్రుత ఉందని అంటున్నారు. ఇంతకీ మొదటి జాబితాలో ఎవరి పేర్లు ఉండబోతున్నాయంటే.

చాలా మంది సిట్టింగు అభ్యర్ధులని చంద్రబాబు మార్చే ఆలోచనలో లేరని తెలుస్తోంది. వీరిలో కొంతమందిని మాత్రమే మార్చుతున్నారని, మరి కొంతమందికి స్థాన చలనం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా పశ్చిమలో అభ్యర్ధుల విషయంలో బాబు ఆచితూచి నిర్ణయం తీసుకోబోతున్నారట. ఎందుకంటే గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ కి పట్టం కట్టిన విషయం తెలిసిందే అంతేకాదు ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా సరే పశ్చిమ ప్రజల ఆశీస్సులు ఉండాల్సిందే. పశ్చిమ నుంచీ వచ్చే సర్వేల విషయంలో బాబు ఎక్కువ శ్రద్ద పెట్టారట. అయితే పశ్చిమ నుంచీ గతంలో బాబు చేయించిన సర్వేల ఆధారంగా, తాజా సర్వేల ఆధారంగా బాబు కొన్ని పేర్లని మొదటి జాబితాలో చేర్చారని తెలుస్తోంది..అయితే పశ్చిమ నుంచీ మొదటి జాబితాలో ఎవరిని చేర్చారు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు. మొదటి జాబితా అభ్యర్ధుల వివరాలు అత్యంత గోప్యంగా ఉన్నాయని ఫిబ్రవరి లో బాబే స్వయంగా ప్రకటిస్తారని అంటున్నాయి టీడీపీ వర్గాలు.