లాస్ ఏంజిల్స్ లో కాల్పుల ఘటన

వాస్తవం ప్రతినిధి: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ న‌గ‌రంలో ఈ రోజు కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకుంది. టొర్రాన్స్‌లోని గ‌బ్లే హౌజ్ బౌల్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కాల్పుల్లో ప‌లువురు చ‌నిపోయి ఉంటార‌ని ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు. క్రైమ్ సీన్ ప్ర‌దేశానికి పోలీసులు చేరుకున్నారు. స‌మీప ప్రాంతాల‌ను సీజ్ చేశారు. కాల్పులు జ‌రిగిన‌ప్పుడు అక్క‌డున్న వారు బార్‌లోకి ప‌రుగులు పెట్టి ప్రాణాలు ద‌క్కించుకున్నారు. బ‌హుశా ఇద్ద‌రు మృతిచెంది ఉంటార‌ని అధికారులు భావిస్తున్నారు.