హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ గా నాన్సీ పెలోసీ

వాస్తవం ప్రతినిధి: అమెరికా ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజేంటేటివ్స్) స్పీకర్ గా నాన్సీ పెలోసీ(78)రెండో సారి ఎన్నికైనట్లు తెలుస్తుంది. అయితే ఆయన ఎంపిక అధ్యక్షుడు ట్రంప్ కు ఎదురుదెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. సీనియర్‌ డెమోక్రాట్, భారత్‌ అనుకూల నేతగా పేరున్న నాన్సీ పెలోసీ ట్రంప్‌ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తి. దీనితో పెలోసీ నేతృత్వంలో సమావేశమైన సభ ‘షట్‌డౌన్‌’కు ముగింపు పలుకుతూ మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి నిధుల కేటాయింపు లేకుండానే బిల్లును ఆమోదించడం గమనార్హం.