పవన్ అభిమానులకి ఉండవల్లి క్లారిటీ..???

వాస్తవం ప్రతినిధి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జనసేన పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. నేను పవన్ తో దోస్తీ చేస్తే తప్పేంటి , జగన్ కి నెప్పేంటి అంటూ బాబు చేసిన కామెంట్స్ తో, ఏపీలో మెగా అభిమానులు మొదలు, జనసేన శ్రేణులు అందరూ షాక్ తిన్నారు. పవన్ కొంపతీసి చంద్రబాబు తో కలుస్తాడా అంటూ ఎన్నో ప్రశ్నలు , అనుమానాలు కూడా తలెత్తాయి. అయితే తాజాగా ఉండవల్లి ఇచ్చిన వివరణతో పవన్ అభిమానులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇంతకీ ఉండవల్లి ఏమన్నారు. చంద్రాబు పవన్ పై చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి కౌంటర్ బాబు కి ఇచ్చారు. అనే వివరాలలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ కి ఉండవల్లి కి మధ్య ఉన్న అవినాభావ సంభంధంతోనే ఉండవల్లి పవన్ కి మద్దతుగా నిలిచారు. మరోసారి చంద్రబాబుతో కలిస్తే పవన్ కు, ఆయన రాజకీయ పార్టీకి భవిష్యత్ ఉండదన్నారు. ఎందుకంటే..రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్ కాంగ్రెస్ ను తిట్టిపోశాడు. బంగాళాఖాతంలో కలిపేద్దాం అన్నాడు. జనం సైతం బాగానే కనెక్ట్ అయ్యారు…కాని ఇప్పుడు టీడీపీని సముద్రంలో కలిపేద్దాం అనాలి. అలా అనకపోతే పవన్ కు భవిష్యత్తు లేదు అంటూ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ తో మరోసారి కలిస్తే తప్పేంటని బాబు మాట్లాడటం వెనుక భారీ స్కెచ్ ఉందని ఉండవల్లి అన్నారు.

బాబు ని తక్కువ అంచనా వేయవద్దని. పవన్, నేను కలిసి తిరిగితే తప్పా అంటూ బాబు వ్యాఖ్యానించడం లాంటివి కావాలనే ప్రజా క్షేత్రంలో బాబు వదిలే ట్రిక్కులని, కావాలనే బాబు ఇలాంటివి వాడులుతాడని ఉండవల్లి అన్నారు. ఎందుకంటే…ఇద్దరూ కలిసిపోతున్నారంటూ అంటూ వ్యాఖ్యలు ప్రజలలోకి వెళ్ళడం వలన. పవన్ తో ఉండే పదిమందిలో సగానికి సగం మంది ఆయన్ని వదిలి వెళ్ళిపోతారు..ఎందుకంటే అంటూ ఉండవల్లి ఈ విషయంలో సైతం వివరణ ఇచ్చారు.

ఎందుకంటే పవన్ తో ఉన్న వాళ్ళందరూ దాదాపు ఎమోషనల్. ఎమోషనల్ గా ఉండే వాళ్ళు బాబు పన్నే వ్యుహాలకి ఈజీగా కనెక్ట్ అవుతారు. దాంతో వారిలో సగానికి సగం మంది పవన్ కి దూరం అయ్యే అవకాశం ఉందనేది ఉండవల్లి వాదన. ఈ విషయాన్ని బాబు గ్రహించాడు కాబట్టే ఎంతో వ్యూహాత్మకంగా బాబు పవన్ పై డ్రామాలు ఆడుతున్నాడు అంటూ ఫైర్ అయ్యారు. బాబు వేసే నక్క జిత్తులకి పడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఉండవల్లి పవన్ కి సూచించారు.