బాలీవుడ్ సీనియర్ నటుడు ఖాదర్ ఖాన్ కన్నుమూత

వాస్తవం సినిమా: బాలీవుడ్ సీనియర్ నటుడు ఖాదర్ ఖాన్ కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆయన కెనడాలోని తన కుమారుడు సర్ఫరాజ్ వద్ద వృద్ధాప్యాన్ని గడుపుతూ, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. కెనడాలోనే ఆయన అంత్యక్రియలు జరుగుతాయని సర్ఫరాజ్ ఖాన్ వెల్లడించారు. కాబూల్ లో జన్మించిన ఖాదర్ ఖాన్, 1973లో తన తొలి చిత్రంలో నటించారు.

“మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. అనారోగ్యంతో డిసెంబర్ 31, సాయంత్రం 6 గంటలకు ఆయన చనిపోయారు. గత 16 వారాలుగా ఆసుపత్రిలో ఉన్న ఆయన మధ్యాహ్నం కోమాలోకి వెళ్లి కన్నుమూశారు. మా కుటుంబమంతా ఇక్కడే ఉంది. మేము ఇక్కడే ఉంటున్నాము కాబట్టి, అంతిమ వీడ్కోలు కూడా ఇక్కడే పలకాలని నిర్ణయించాం. మా నాన్న మృతి విషయాన్ని తెలుసుకుని సంతాపాన్ని తెలుపుతున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అని సర్ఫరాజ్ పేర్కొన్నారు.