కేసీఆర్ బాబు కి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా…???

వాస్తవం ప్రతినిధి: తెలంగాణలో కేసీఆర్ ని ఓడించడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నం వికటించిన విషయం అందరికి విధితమే..అయితే టీఆర్ఎస్ గెలిచిన తరువాత విజయోత్సాహంతో ప్రజలకి కృతజ్ఞతలు చెప్తూనే అదే వేదికపై బాబు ని ఏకి పడేసిన విషయం కూడా తెలిసిందే. కాని ఆ సమయంలోనే కేసీఆర్ చంద్రబాబు ని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు..నన్ను ఓడించడానికి వచ్చిన బాబు కి మనం కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా..ఇచ్చేస్తే పోలా అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలని అందరూ సీరియస్ గా తీసుకోలేదు. ఇవి రాజకీయ వ్యాఖ్యలు గానే చూశారు..కానీ

ఇప్పుడు కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తుంటే..బాబు కి ఇస్తానని చెప్పిన ఆ రిటర్న్ గిఫ్ట్ ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఇచ్చేసేలానే ఉన్నారు. ఇంతకీ బాబుకి కేసీఆర్ ఇస్తానని చెప్పిన ఆ రిటర్న్ గిఫ్ట్ ఏమిటి..?? ఎలాంటి వ్యుహాలని కేసీఆర్ బాబు పై అమలు చేయడానికి సిద్దంగా ఉన్నారు..?? అనే వివరాలని విశ్లేషిస్తున్న విశ్లేషకులకి దిమ్మతిరిగిపోతోందట. గురువుని మించిన శిష్యుడు కేసీఆర్ అంటున్నారు రాజకీయ పండితులు. ఇంతకీ కేసీఆర్ గిఫ్ట్ విషయంలోకి వెళ్తే…

బీజేపీ ని చెడామడా తిట్టేస్తున్న కేసీఆర్ తాజాగా కేసీఆర్ తో భేటీ అయ్యారు.ఈ విషయంలో అందరూ ఇదేంటి కేసీఆర్ ఇలా ఎందుకు చేశారు అని ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ మాత్రం..కేసీఆర్ ప్లాన్ ని అంచనా వేసేసింది అనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ వెళ్ళింది అందుకే అంటూ టీడీపీ లోని కొందరు నేతలు కొరుక్కుంటున్న చెవుల మాటలు బయటకి కూడా వచ్చేశాయి..మన నేత కోసం ఓటుకు నోటు బెల్టు మళ్ళీ తీస్తారా అనేది వారి ధర్మ సందేహం అయితే ఈ సందేహం వారి ఒక్కరిదే అంటే పొరపాటే…

తెలుగు రాష్ట్రాలలో ప్రతీ ఒక్కరికి ఇదే ప్రశ్న మెదిలింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.
ఏపీలో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు మొదలుకానున్నాయి. ఈ తరుణంలో బాబు కు ఇస్తాననే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేయడానికి ఈసారి ఓటుకు నోటు కేసు పై కేసీఆర్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోందని అంటున్నారు. గతంలో ఇదే వ్యవహారంలో మోడీ వద్దే రాజీ కుదిరిందని అయితే ఇప్పుడు మళ్ళీ ఈ విషయంలో మోడీ వద్దకే వెళ్ళడంతో రాజీ కి నై నై చెప్పి కేసీఆర్ రంగంలోకి దిగనున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే కేసీఆర్ ,మోడీ భేటీ ఇందుకేనా మరెందుకైనా జరిగిందా అనేది కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది కంగారు ఎందుకు అంటున్నారు టీఆర్ఎస్ సీనియర్ నేతలు.