వైసీపీలో “ఆ నలుగురికి”… టిక్కెట్లు కన్ఫర్మ్..!!!

వాస్తవం ప్రతినిధి: తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి మొదలయ్యింది..తెలంగాణలో ఈ హడావిడికి శుభం కార్డు పడగా..ఇక మిగిలిన టెన్షన్ అంతా ఏపీలోనే ఉంది. ఏపీలో త్రికోణ పోరులో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నిన్నా మొన్నటి వరకూ నెలకొంది అయితే తెలంగాణలో టీడీపీ ఓటమితో ఆ ప్రభావం ఏపీలో కూడా చూపే అవకాశం ఉండటంతో నేతలు అందరూ వైసీపీలో టిక్కెట్ల కోసం ఆత్రుతగా వేచి చూస్తూ ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే.

టీడీపీలో ఉన్న సీనియర్స్ కొందరు వైసీపీలోకి ,మరి కొందరు జనసేనలోకి జంప్ చేసే ప్రక్రియలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్ మోహన్ రెడ్డి పార్టీకి మరింత ఊపు తేసుకురావదానికి తాజాగా కొన్ని నియోజకవర్గాలలో నేతలకి టిక్కెట్లని కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వారు ఫీల్డ్ వర్క్ లోకి దిగారట కూడా. జగన్ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ కూడా తాజాగా రిపోర్టులు పంపిన నేపధ్యంలో జగన్ గతంలో ప్రకటించిన అభ్యర్దులు ప్రజలలో ఉండాలని వార్నింగ్ లు ఇవ్వడం మొదలు పెట్టారట..అయితే ప్రశాంత్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే..

ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు అత్యంత కీలక నేతలకు టిక్కెట్లు ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగన్ వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారి వారి పనుల్లో బిజీ బిజీగా ఉండిపోయారు. నియోజక వర్గాల వారిగా వారి వారి పేర్లని పరిశీలిస్తే..ప్ర‌కాశం జిల్లాకు చెందిన మానుగుంట మహిధర్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, బెర్ర మధుసూదన్, ఆదిమూలపు సురేష్ లకు జగన టిక్కెట్లు దాదాపు ఖారారు చేశారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే విజయనగరం నియోజకవర్గం టిక్కెట్ ను ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామికి ఖరారు చేశారు…అంతేకాకుండా వీరితో పాటుగానే గిద్ద‌లూరు నుంచి అన్నా రాంబాబుకు టిక్కెట్టు ఖాయం అయినట్టుగా తెలుస్తోంది.

ఇదిలాఉంటే 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గతంలో తమనుంచీ టీడీపీలోకి వెళ్ళిపోయినా ఎమ్మెల్యేలని  ఎలాగైనా సరే ఓడించి వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది..ఏది ఏమైనా సరే ఈ సారి జగన్ ఎట్టిపరిస్థితుల్లో ఏపీలో చక్రం తిప్పాలని అందుకు తగ్గ వ్యుహాలని సిద్దంగా ఉంచుకున్నాడని అంటున్నారు రాజకీయ పండితులు.