ఈనెల 23న హస్తినకు వెళ్ళనున్న కేసీఆర్

వాస్తవం ప్రతినిధి: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి మలి విడత చర్చలకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఆదివారం ఆయన భువనేశ్వర్ వెళ్లి, అక్కడ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటన సంబంధించని షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 23న విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శిస్తారు. ఇటీవల రాజ శ్యామల యాగం నిర్వహించిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసి ఆశీర్వాదం తీసుకుంటారు. అక్కడి నుంచి భువనేశ్వర్ చేరుకుని సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశమవుతారు. అనంతరం ఢిల్లీకి చేరుకుంటారు. 24న యూపీ మాజీ సీఎం అఖిలేష్, బీఎస్పీ అధినేత్రి మాయవతితో సమావేశం అవుతారు. అదే రోజు అపాయింట్ మెంట్ దొరికితే ప్రధాని మోడీని కూడా కలుస్తారు.