జనసేన లో చేరనున్న ప్రముఖ పారిశ్రామికవేత్త

వాస్తవం ప్రతినిధి: ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీలో చేరికలు జోరు అందుకోనున్నాయి. గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చంద్రశేఖర్ యాదవ్ జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం అయింది. ఇటీవల పవన్ కల్యాణ్ ను కలిసిన చంద్రశేఖర్ గిద్దలూరు టికెట్ పై హామీ పొందినట్లు తెలిసింది. ఆంధ్రా పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి సన్నిహితుడైన చంద్రశేఖర్ త్వరలోనే జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.

మరోవైపు ఒంగోలు నగరం త్రోవగుంట ప్రాంతంలో తన ఆఫీసును జనసేన కార్యాలయంగా మార్చాలని చంద్రశేఖర్ యోచిస్తున్నట్లు సమాచారం. అమెరికాలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ ఏపీకి తిరిగివచ్చిన వెంటనే చంద్రశేఖర్ ఆయన సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీచేసిన చంద్రశేఖర్, ప్రజారాజ్యం అభ్యర్థి అన్నె రాంబాబు చేతిలో ఓటమి పాలయ్యారు.