విభజన హామీలు నెరవేరాలంటే రాహుల్ ప్రధాని కావాలి: కిరణ్‌కుమార్‌రెడ్డి

 వాస్తవం ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మైత్రిపై తనకూ ఆశ్చర్యంగానే ఉందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఇవాళ విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ చెప్పారు. యూపీఏ వచ్చి రాహుల్ ప్రధాని అయితే ప్రత్యేక హోదా సహా.. విభజన హామీలు నెరవేరతాయన్న నమ్మకంతోనే చంద్రబాబు.. రాహుల్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు. బీజేపీ అన్ని విధాలుగా ఫెయిలైందన్న కిరణ్‌.. విభజన హామీలు నెరవేరాలంటే యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని కవాలన్నారు. వైసీపీ అధినేత జగన్ ఎన్ని రోజులు.. ఎందుకు నడుస్తున్నాడో తనకు అర్ధం కావడం లేదని