ఆందోళనలో బాబు “ఆ 25”..మందికి విందు భోజనం..!!!

వాస్తవం ప్రతినిధి: రాజకీయాల్లో బాబు ని మించిన నేత మరొకడు ఉండరు, ఉండే అవకాశమే లేదు. ఈ విషయం అందరికి తెలిసిందే. కాని ఇప్పుడు అదంతా గతం ప్రస్తుతానికి తొందరపడిన కోయిల ముందుగా కూస్తే ఏమవుతుందో బాబు పరిస్థితి అదే అయ్యింది. తెలంగాణలో చక్రం తిప్పాలని అనుకుని వీరావేశంగా కధం తొక్కిన బాబు చక్రం తిప్పడం మాట అలా ఉంచితే తెలంగాణలో మరో మారు అడుగు పెట్టడానికి వీలు లేకుండా పోయింది. దాంతో బాబు ఇప్పుడు ఏపీ పై ఫుల్ గా శ్రద్ధ పెట్టారట. అందులో భాగంగానే పార్టీలో ప్రక్షాళన చేపట్టారు.

గతంలో చంద్రబాబు తాను చేయించిన సర్వే ఆధారంగా ఎవరైతే ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకుంటారో వారికి టిక్కెట్లు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుని, వారిని నేరుగా తన ఇంటికి పిలిపించి, భోజనం పెట్టి మరీ ఈ సారి టిక్కెట్టు మీకు లేదనే చావు కబురు చల్లగా చెప్పే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ సమయంలో కొందరు నేతలు సైతం బాబు ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చారు అయితే…

ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు బాబు తాను ఫైనల్ చేసుకున్న దాదాపు 25 మంది సిట్టింగు అభ్యర్ధులని ఇంటికి పిలిపించి విందు భోజనం పెట్టే పనిలో ఉన్నారట. అంటే దాదాపు వారికి టిక్కెట్లు రావని ఫిక్స్ అయ్యిపోవచ్చు అంటున్నారు పార్టీ వర్గాలు. ఇదిలాఉంటే..ఈ లిస్టు లో ఉన్న వారు దాదాపుగా ప్రజా వ్యతిరేకతని ఎదుర్కుంటూ, పార్టీలో నేతల మధ్య సఖ్యత లేకుండా గొడవలు పెట్టుకుంటూ టీడీపీ పరువుని బజారున పెట్టిన వాళ్ళే అధికంగా ఉన్నారట..అంతేకాదు కొంత మంది కీలక నేతలని సైతం బాబు ఈ లిస్టులో చేర్చినట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ విందు భోజనం అందుకునే మొదటి వరసలో పశ్చిమగోదావరి పాలకొల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు నిమ్మలతో పాటు నడిచే వారిలో మెట్ట ప్రాంతం అందులోనూ ఏజెన్సీ ఏరియా పోలవరంకి చెందిన ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ పేరు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు..ఈ వరసలోనే నిడదవోలు..భీమవరం ,ఇలా పలు కీలక స్థానాలు సైతం ఉండటం గమనార్హం..త్వరలోనే 25 మంది అభ్యర్ధులపై బాబు వేటు వేయనున్నారనే సమాచారం టీడీపీలో నేతలని కలవరపెడుతోంది..మరి బాబు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..బాబు విందు భోజనం చేసేది ఎవరో త్వరలో తేలిపోనుంది అంటున్నారు పరిశీలకులు.