మోదీ పై పరోక్షంగా విమర్శలు చేసిన మన్మోహన్

వాస్తవం ప్రతినిధి: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని నరేంద్రమోదీపై పరోక్షంగా విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై వస్తోన్న వరుస వివాదాలపై మోదీ మౌనంగా ఉండటం పట్ల ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. ‘ప్రజలు నన్ను మౌనంగా ఉండే ప్రధానమంత్రి అన్నారు. కానీ నేను ప్రధానిగా ఉన్న సమయంలో మీడియా ఎదుట మాట్లాడేందుకు ఎన్నడూ భయపడలేదు అని,మీడియాను రెగ్యులర్‌గా కలిసేవాడిని అని మన్మోహన్ తెలిపారు. విదేశీ పర్యటనకు వెళ్లొచ్చిన ప్రతిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించేవాడిని అని ఆయన గుర్తు చేశారు. అయితే 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించలేదని ఆయన విమర్శించారు. ఆయన రాసిన ‘ఛేంజింగ్‌ ఇండియా’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.