జగన్ “గెలుపు” కై బాబు కృషి….“ఇదేమి విడ్డూరం”..???

వాస్తవం ప్రతినిధి: జగన్ సీఎం అవ్వడం కోసం చంద్రబాబు పరితపిస్తున్నారా..?? ఏపీలో జగన్ గెలుపే లక్ష్యంగా బాబు పెద్ద సాహసమే చేస్తున్నారా..?? అంతా మాయలా ఉందా..??కన్ఫ్యూజన్ లో ఉన్నారా..?? ఆగండి ఆగండి.. మీ కన్ఫ్యూజన్ కి తెర దించే క్లారిటీ సిద్దంగా ఉంది అయితే..జగన్ ని సీఎం చేయడమే లక్ష్యంగా బాబు వ్యూహాలు రచిస్తున్నారు అనేది మాత్రం పక్కా. ఇదే విశ్లేషకులు సైతం అంటున్న నిజం..మరి ఎలా సాధ్యం అంటే..??????

తెలంగాణలో ఓటమితో, అక్కడి ప్రజలు ఇచ్చిన షాక్ తో, చంద్రబాబు కి దిమ్మతిరిగిన మాట వాస్తవమే కాని..ఏపీలో జగన్ గెలుపుకి బాబు కృషి చేస్తున్నది కూడా నిజమే అంటున్నారు ఎలా అంటే..తెలంగాణా రాష్ట్రం ఏర్పడటానికి కేసీఆర్ కృషి ఎనలేనిది. ఈ విషయం అందరికి తెలిసిందే అయితే..తెలంగాణా ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే ఈ విషయం కూడా మనం మర్చిపోకూడదు .అలాంటి పార్టీకే దిమ్మతిగేలా రెండు సార్లు ఘలక్ ఇచ్చారు తెలంగాణా ప్రజలు..మరి ఏపీ విడిపోయి ఏపీ ప్రజలకి సరైన అభివృద్ధి లేకుండా పోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అని వేరేగా చెప్పనవసరం లేదు…మరి ఏపీకి ద్రోహం చేసిన కాంగ్రెస్ ని ప్రజలు ఎలా క్షమిస్తారు..??

మరి అలాంటి పార్టీతో తెలంగాణలో అంటకాగిన బాబు..మళ్ళీ ఏపీలో కాంగ్రెస్ పార్టీతో జతకడితే ఏపీ ప్రజలు ఊరుకుంటారా అంటే అస్సలు ఊరుకోరనే చెప్పాలి..కాని ఇలాంటి సమయంలో సైతం బాబు ఏపీలో కాంగ్రెస్ తో జట్టు కట్టడానికి వ్యుహాలని సిద్దం చేసుకుంటున్నారట. అంతేకాదు త్వరలో ఆవైపుగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారట. టీడీపీలో ఎంతో మంది నేతలు తెలంగాణలో పొత్తు విషయంలోనే అభ్యంతరం తెలిపినా మన రాష్ట్రం కాదుకదా మనకి ఏమి కాదులే అనుకున్నారు..కాని

ఇప్పుడు బాబు ఏకంగా ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని అనుకోవడంతో సీన్ రివర్స్ అవుతోంది. బాబు తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఏపీలో సైతం టీడీపీ పార్టీ పరువుని పళంగా పెడుతున్నారు అంటూ విమర్శలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఇదే పొత్తు బాబు ఖాయం చేస్తే తప్పకుండా జగన్ సీఎం అవ్వడం ఖాయమని, ఏపీ ప్రజల ఆగ్రహానికి బాబు తో పాటు టీడీపీ పార్టీ భూస్తాపితం అవ్వడం జరిగి తీరుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. కాని ఇవేమీ పట్టని చంద్రబాబు తనని తానూ భవిష్యత్తులో కాపాడుకోవడానికి ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ఖాయమని చంద్రబాబు వ్యతిరేక ఓట్లు అటు జనసేన పడటంతో ఏపీలో జనసేన బలమైన పార్టీగా ఆవిర్భవిస్తుందని, మరికొన్ని ఓట్లు వైసీపీ కి పడతాయని , ఇదే జగన్ సీఎం అవ్వడానికి కారణం అవుతుందని..అంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..లేక జగన్ ని సీఎం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటారో వేచి చూడాలి.