ఆ షోలో ప్రభాస్- రానా గుట్టు లీక్ చేయనున్న జక్కన్న?

వాస్తవం సినిమా: గత రెండు వారాలుగా బాలీవుడ్ లో ఆసక్తిగా ముచ్చటించుకుంటున్న టాపిక్ ఏమిటంటేకాఫీ విత్ కరణ్ లేటెస్ట్ స్పెషల్ ఎపిసోడ్ లో బాహుబలి టీం హాజరుకానున్నట్లు. తాజా వార్త ఏమితంతే ఈ షోలో ప్రభాస్- రానా గుట్టు జక్కన్న లీక్ చేస్తాడట. ఇంతకీ ఏమితా సీక్రేట్? అన్న విషయాల్లోకెళితే..
ప్రభాస్- రానా ఇద్దరిలో ఎవరు బిగ్ బ్యాడ్ బోయ్? అని కరణ్ రాజమౌళి ని ప్రశ్నిస్తే అందుకు సమాధానంగా ప్రభాస్ నే .. కానీ అది కనిపెట్టలేరు అంటూ అంటూ షాకిచ్చాడు రాజమౌళి. అలాగే ప్రభాస్ డేటింగ్ ఎవరితో? అనుష్కతో ఎఫైర్ కథేంటి? తదితర ప్రశ్నలకు ప్రభాస్ స్పందించారు. ఇక ఇప్పటికే ఈ క్రేజీ టీవీ షోలో దీపిక పదుకొనే- రణవీర్ సింగ్- అమీర్ ఖాన్- కత్రిన కైఫ్- వరుణ్ ధావన్- కాజోల్ వంటి స్టార్లను కరణ్ గత ఎపిసోడ్స్లో ఇంటర్వ్యూలు చేసిన సంగతి తెలిసిందే. వాటన్నిటికంటే బాహుబలి త్రయం ఎపిసోడ్ కోసమే జనం ఆసక్తి గా వేచి చూడడం విశేషం. ఈ షో కోసం ప్రభాస్- రానా- రాజమౌళి అల్ట్రా మోడ్రన్ స్టైల్లో కి మారిపోయి కొత్త లుక్ తో షూటింగ్లో పాల్గొన్నారు.ఈ షోని అటు ఉత్తరాదితో పాటు ఇటు దక్షిణాదినా కోట్లాది మంది అభిమానులు వీక్షించేందుకు రెడీ అవుతున్నారు.