అలాంటి మాట విని విని అలసిపోయా: ఇంద్రగంటి

వాస్తవం ప్రతినిధి: సున్నితమైన కథాంశాలతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి. ఆయన చిత్రాలను చూసిన ప్రతి ఒక్కరూ కూడా చాలా డీసెంట్ చిత్రాలు తీస్తాడు అంటూ అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటి మాట విని విని ఆయన అలసిపోయారట. నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి మాట వింటానని అనుకోలేదు. ఇంకా దరిద్రమేంటంటే నేను డీసెంట్‌ సినిమాలు తీస్తున్నాన్నంటే ఇతర దర్శకులు అసభ్య సినిమాలు తీస్తూ ఎక్కువ సంపాదిస్తున్నట్లు అర్థం వస్తోంది!’’ అంటూ నవ్వుతూ ట్వీట్‌ చేశారు. ‘గ్రహణం’ నుంచి ఇటీవల ‘సమ్మోహనం’ వరకూ కూడా ఆయన చిత్రాలు చూస్తె ఆయన డీసెంట్ సినిమాలు తీసారు అనే అనుకుంటారు.  ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్‌కృష్ణ తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో నాని కథానాయకుడిగా నటించే అవకాశం ఉంది. అంతేకాదు, ఇందులో మరో కథానాయకుడికీ చోటుందట. ఆ పాత్రను దుల్కర్‌ సల్మాన్‌తో చేయిస్తే బాగుంటుందని ఇంద్రగంటి భావిస్తున్నారట. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. నాని ప్రస్తుతం నటిస్తున్న ‘జెర్సీ’తో విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం పూర్తయ్యాక ఈ సినిమా పట్టాలెక్కనుంది.