కేసీఆర్ క్యాబినెట్ లో కొత్త ముఖాలు..ఎవరంటే..??

వాస్తవం ప్రతినిధి: కేసీఆర్ విసిరిన పంజాకి కూటమి కోటలు బద్దలయ్యి పోయాయి..తెలుగు సినిమాలలో హీరోలు కొడితే గాలిలో తేలినట్లుగా కేసీఆర్ ఇచ్చిన ఒకే ఒక్క దెబ్బకి కూటమి కుదేలయ్యిపోయింది. పోయి పోయి చంద్రబాబు కేసీఆర్ తో పెట్టుకుని గబ్బు గబ్బు అయ్యాడు అంటూ సోషల్ మీడియా లో సెటైర్స్ మీద సెటైర్స్ వేస్తున్నారు..సరే ఏది ఏమైనా సరే చంద్రబాబు అనవసరంగా తెలంగాణా ఎన్నికల్లో వేలు పెట్టాడు అంటున్నారు పరిశీలకులు. ఇదిలాఉంటే కేసీఆర్ రెట్టింపు ఉత్సాహంతో మరింత దూకుడుగా వ్యవహరించనున్నారని టాక్ వినిపిస్తోంది.

కేసీఆర్ ఈ సారి మరింత ప్రణాళికా బద్దంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేకించి ఆయన మంత్రి వర్గాన్ని సరికొత్తగా తీర్చి దిద్దనున్నారని తెలుస్తోంది…తెలంగాణాలో తిరుగులేని మెజారిటీతో గెలిచినా కేసీఆర్ ఇకపై విమర్శలు లేకుండా పాలన చేయాలని అనుకుంటున్నారట. అందుకు తగ్గట్టుగానే తన సరికొత్త టీం తో త్వరలోనే కీలకంగా భేటీ కానున్నారని తెలుస్తోంది.

అయితే కేసీఆర్ ముఖ్యంగా తన క్యాబినెట్ లో ఈ వర్గాలకి అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. తెలంగాణలో గతంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మహిళల కి పెద్ద పీట వేయలేదనే అపవాదు ఉంది. అంతేకాదు దళితులకు ముఖ్యమంత్రి ఇవ్వకుండా ఉన్న విమర్శలు కూడా ఉన్నాయి , అంతేకాదు విద్యార్ధి సంఘాల నేతలకి సైతం గతంలో తమకి సరైన గుర్తింపు దక్కలేదని కేసీఆర్ దగ్గర మొర పెట్టుకున్నారు కూడా..అయితే వీరందరికీ ఇప్పుడు కేసీఆర్ న్యాయం చేయనున్నారట..

విద్యార్ధి పోరాటాల నుంచి వచ్చిన బాల్కా సుమన్ ని కేసీఆర్ ఈ సారి తన తన మంత్రి వర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆయన గతంలో ఎంపీగా పోటీ చేశారు..ఈ సారి మాత్రం ఎమ్మెల్యే గా పోటీ చేసి ఘన విజయం సాధించడంతో ఆయన్ని తప్పకుండా కేసీఆర్ క్యాబినెట్ లోకి తీసుకుంటారని అంటున్నారు. అలాగే దళితులకి పెద్దపీట వేయడంలో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.