బాలీవుడ్ పాపులర్ షో నుండి బాహుబలి టీమ్ కు ఆహ్వానం

వాస్తవం సినిమా: బాలీవుడ్ పాపులర్షో కాఫీ విత్ కరణ్ నుండి బాహుబలి టీం కు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నందు సెలెబ్రిటీల చిట్ చాట్ షో కాఫీ విత్ కరణ్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించే ఈ షోలో పాల్గొనేందుకు ఎక్కువమంది సెలెబ్రిటీలు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు కరణ్ చూపుడు బాహుబలి ప్రభాస్ పై పడ్డాయి. బాహుబలి 2 రిలీజ్ సమయంలో బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన విషయంపై అప్పట్లో ఓ హింట్ ఇచ్చాడు. బాలీవుడ్ లో నటించే అవకాశం ఉందని చెప్పాడు.

బాహుబలి తరువాత ప్రభాస్, టాలీవుడ్ లో సాహో, జిల్ రాధాకృష్ణతో సినిమా చేస్తుండటంతో బాలీవుడ్ ఎంట్రీ విషయం వాయిదా పడింది. కాగా, ఇప్పుడు కరణ్ జోహార్ బాహ్బలి టీమ్ ను కాఫీ విత్ కరణ్ షో కు ఆహ్వానించాడట. టీమ్ కూడా పాజిటివ్ గానే స్పందించినట్టు సమాచారం. ఎలాగో సాహో ను బాలీవుడ్ లో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్రభాస్ అనుకుంటున్నాడు. ఈ షో ద్వారా బాలీవుడ్ కు దగ్గర కావొచ్చని అభిప్రాయం. మరోవైపు కరణ్ ఈ షోకు పిలిచి, ప్రభాస్ ను సినిమాకు లాక్ చేయించాలని అనుకుంటున్నాడట. ఈ షో ఎప్పుడు ఉంటుందనే విషయం ఈ నెలాఖరు వరకు క్లారిటీ వస్తుంది.