ఫ్రాన్స్ లో ఆందోళనలు….మూసివేయనున్న ఈఫిల్ టవర్

వాస్తవం ప్రతినిధి: ఫ్రాన్స్‌లో ఆందోళ‌న‌లు మిన్నంటుతుండడం తో శ‌నివారం పారిస్‌లోని ఈఫిల్ ట‌వ‌ర్‌ను మూసివేయ‌నున్నట్లు తెలుస్తుంది. ఇంధనంపై పన్నులు, పెరిగిపోతున్న ఖర్చులకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ గత కొద్ది వారాలుగా గళమెత్తిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఒకపక్క ప్రభుత్వం పన్నులను తగ్గిస్తామని నిర్ణయం తీసుకున్నప్పటికీ నిరసనకారులు మాత్రం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులు చేతుల్లో రాడ్లు, గొడ్డళ్లు పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. కనిపించిన వాహనాలు, ఇళ్లను తగులబెట్టారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దేశ‌వ్యాప్తంగా 89 వేల పోలీసు ఆఫీస‌ర్లు డ్యూటీలో ఉన్నారు. ఆర్మీ వాహ‌నాలను కూడా మోహ‌రించారు. పారిస్‌లో ఉన్న షాపులు, రెస్టారెంట్ల‌ను మూసివేయాల‌ని పోలీసులు ఆదేశించారు. యెల్లో వెస్ట్ పేరుతో ఫ్రాన్స్‌లో నవంబర్ 17 నుంచి ఉద్యమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.