బ్రేగ్జిట్ నుంచి నిష్క్రమించాలో లేదో ఎంపీ లే నిర్ణయించుకోవాలి: థెరిస్సా మే

వాస్తవం ప్రతినిధి: ఐరోపా కూటమి నుండి బ్రిటన్‌ నిష్క్రమించాలో, వద్దో తేల్చుకోవాల్సింది మీరేనని బ్రిటన్‌ ప్రధాని థెరెస్సా మే పార్లమెంట్‌ సభ్యులకు సూచించారు. గురువారం బిబిసి రేడియోకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ఇటీవల పార్లమెంట్ లో బ్రేగ్జిట్ కు వ్యతిరేకం వ్యక్తం అవ్వుతుండడం తో ప్రధాని మే పై కూడా ఎంపీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమ్మలో ఆమె బిబిసి రేడియో కిచ్చిన ఇంటర్వూ లో  మాట్లాడుతూ బ్రెగ్జిట్‌పై ఇయుతో కుదుర్చుకున్న ఒప్పందంపై ఈ నెల 11న పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరుగనున్న నేపథ్యంలో ఒప్పందాన్ని ఆమోదిస్తారో లేక ఒప్పందం లేకుండానే నిష్క్రమించమంటారో, అసలు నిష్క్రమణే రద్దు చేయమంటారో ఎంపిలే తేల్చుకోవాలని అన్నారు. బ్రెగ్జిట్‌ అనంతరం ఉత్తర ఐర్లండ్‌ విషయంలో నిర్ణయం తీసుకునే విషయంలో పార్లమెంట్‌ కీలక పాత్రపోషిస్తుందని ఆమె అన్నారు. బ్రెగ్జిట్‌ను నిరోధించటానికి పార్లమెంట్‌లో కొంతమంది ప్రయత్నిస్తున్నారని, అయితే బ్రెగ్జిట్‌పై మరో రిఫరెండం సరైనదని తాను భావించటం లేదని ఆమె స్పష్టం చేశారు.