నిలకడగా ఆడుతున్న ఆసీస్ జట్టు

వాస్తవం ప్రతినిధి: ఆడిలైడ్ వేదికగా ఆసీస్-భారత్ ల మధ్య జరిగిన తొలి టెస్ట్ తోలి ఇన్నింగ్స్ లో ఆసీస్ జోరు పెంచింది. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఇంచుకోవడం తో తొలి ఇన్నింగ్స్ లో 250 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో తోలి ఇన్నింగ్స్ ప్రారంబించిన ఆసీస్ జట్టు నిలకడగా ఆడుతుంది. ట్రేవిస్‌ హెడ్‌ 109బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. టీమిండియా బౌలర్ల దాడిని ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ సమర్థంగా ఎదుర్కొంటున్నారు. హెడ్‌తో పాటు ప్రస్తుతం కమిన్స్‌(8) క్రీజులో ఉన్నాడు. 78ఓవర్లు పూర్తయ్యేసరికి ఆసీస్‌ ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది.