మ్యాచ్ అనంతరం మిల్క్ షేక్ తాగాను: పూజారా

వాస్తవం ప్రతినిధి: ఆసీస్‌తో టీమిండియా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌ పూర్తి అయిన సంగతి తెలిసిందే. తోలి ఇన్నింగ్స్ లో 250 పరుగుల కు టీమిండియా ఆలౌట్ అవ్వడం తో ఆసీస్ జట్టు బరిలోకి దిగింది. తోలి ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్లు తడబడ్డారు, కానీ చేతేశ్వర పూజారా మాత్రం కాస్త నిలకడగా ఆది జట్టును ఆదుకున్నాడు అనే చెప్పాలి.  వికెట్లు టపటపా పడిపోతున్నా ఏ మాత్రం బెదరకుండా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. మొత్తానికి తొలి ఇన్నింగ్స్‌లో పుజరా హీరో అయిపోయాడు. మ్యాచ్‌ అనంతరం పుజారా మీడియాతో మాట్లాడాడు.

‘ శతకం బాదిన నా ఆనందాన్ని చాకొలేట్‌ మిల్క్‌షేక్‌తో ఆస్వాదించాను. మ్యాచ్ అనంతరం వచ్చి ‘అలిసిపోయాను..మిల్క్‌షేక్‌ ఇవ్వండి’ అని అడిగాను. అక్కడున్న వాళ్లందరూ నవ్వుకున్నారు. నిజంగా ఆసీస్‌ గడ్డ మీద ఎండ ఎక్కువగా ఉంది. స్వదేశంలో ఎండలో ఎన్నో మ్యాచ్‌లు ఆడాం. కానీ ఆసీస్‌లో ఉండే వాతావరణాన్ని తట్టుకోవడం కాస్త కష్టమే. మిల్క్‌షేక్‌ ఒక్కటే నన్ను ఆ తాపం నుంచి కాపాడుతుంది. కానీ ఫిజియో వైద్యుల సూచన మేరకు ఈ రోజు ఐస్‌బాత్‌ చేయాల్సి వచ్చింది’ అని తెలిపాడు.