కోహ్లీ కంటే ఒపెనర్ లే ముఖ్యం

వాస్తవం ప్రతినిధి:  ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ కంటే ఓపెనర్లే కీలకమని సీనియర్‌ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు. తొలి ఇన్నింగ్న్‌లో భాగంగా తొలిరోజు టీమిండియా ఓపెనర్లు తడబడడమే కాకుండా సారధి కోహ్లి సైతం నిరసపరచిన సంగతి తెలిసిందే. దీనిపై గవాస్కర్ మాట్లాడుతూ……. ‘ఆసీస్‌ టెస్టులో ఓపెనర్లు చాలా కీలకం. ఓపెనర్లు ఎలా ఆడతారనే దానిపై మ్యాచ్‌ విజయం ఆధారపడి ఉంది. విరాట్‌ కోహ్లీ కంటే వారే కీలక పాత్ర పోషించాలి. ఒక వేళ వారు విఫలమయితే అప్పుడు కోహ్లీ రంగంలోకి దిగుతాడు. ప్రతిసారీ అతడిపైనే భారం వేయడం సరికాదు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేసింది. ఇప్పుడు చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటే ఆసీస్‌ గడ్డపై కోహ్లీ సేన చరిత్ర సృష్టించవచ్చు’ అని చెప్పుకొచ్చారు. అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 250 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే.