వేదిక పై కళ్ళు తిరిగి పడిపోయిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

వాస్తవం ప్రతినిధి: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వేదిక పై కళ్ళు తిరిగి పడిపోయారు. ఆయన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఉన్నట్టుండి వేదిక పై కళ్ళు తిరిగి పడిపోయారు. రాహురి ప్రాంతంలోని మహాత్మ జ్యోతిరావ్‌ పూలే కృషి విద్యాపీఠ్‌ వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన స్నాతకోత్సవానికి గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో ఆయన ఒక్కసారిగా వేదికపై కుప్పకూలిపోయారు. దీనిని గమనించిన మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, భద్రతా సిబ్బంది ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగుపడినట్లు తెలుస్తుంది.  అయితే శరీంలో చక్కెర శాతం‌ తగ్గిపోవడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారని  చికిత్స అనంతరం గడ్కరీ ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. అనంతరం ఆయన ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ. ‘నా ఆరోగ్యం బాగుందని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కెర స్థాయి పడిపోవడంతో కళ్లు తిరిగాయి. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది. అందరికీ కృతజ్ఞతలు’ అని అన్నారు.