మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్,మిజోరం లో హాంగ్…పీపుల్స్ పల్స్ సర్వే

వాస్తవం ప్రతినిధి: ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని రాజకీయ పరిశోధన సంస్థ ‘పీపుల్ పల్స్’ తెలిపింది. అలానే చత్తీస్‌గఢ్‌లో కూడా 15 ఏళ్ల బీజేపీ పాలకను తెరపడబోతోందని, అలాగే ఇప్పటికే కాంగ్రెస్‌ పాలనలో ఉన్న మిజోరం రాష్ట్రంలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందని హైదరాబాద్‌కు చెందిన ఈ ‘పీపుల్స్‌ పల్స్‌’ సంస్థ నవంబర్‌లో నిర్వహించిన ముందస్తు ఎన్నికల సర్వే ఫలితాలు తెలిపాయి. అయితే గత 15 ఏళ్లుగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనకు తెరపడబోవడం విశేష పరిణామం. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ 41.6 శాతం ఓట్లతో 116 నుంచి 120 సీట్లను గెలుచుకోబోతుండగా, పాలకపక్ష బీజేపీ పార్టీ 39.3 శాతం ఓట్లతో 98–102 స్థానాలకు పరిమితం కాబోతోంది.