తెలంగాణా లో భారీ స్థాయిలో ఓటింగ్ నమోదు

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.  ఓట‌ర్లు పోటెత్తారు. దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ భారీ స్థాయిలో ఓటింగ్ సాగుతున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధికంగా మెద‌క్ జిల్లాలో ఓటింగ్ శాతం న‌మోదు అయ్యింది. మెద‌క్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు 75.57 శాతం ఓటింగ్ న‌మోదు అయిన‌ట్లు తెలుస్తోంది. మెద‌క్ అసెంబ్లీ స్థానం నుంచి ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి .. టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున పోటీలో ఉన్నారు. న‌ర్సాపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ 68.93 శాతం ఓటింగ్ న‌మోదు అయ్యింది. సీఎం కేసీఆర్‌కు చెందిన గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ భారీ స్థాయిలో ఓట్లు పోల‌వుతున్నాయి. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు గ‌జ్వేల్‌లో 61 శాతం ఓట్లు పోల‌య్యాయి.