తొలిసారి ఓటు వేసిన గద్దర్

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ ఎన్నికల్లో తోలి సారి ప్రజా గాయకుడు గద్దర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణి తో కలిసి వచ్చిన గద్దర్ అల్వాల్ లోని వెంకటాపురం లో తన జీవితంలో తొలిసారి ఓటు వేశారు. 70 ఏళ్ల గద్దర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు. గతంలో భువనగిరిలో బ్యాంక్ ఉద్యోగిగా చేసే సమయంలో మావోయిస్ట్ పార్టీలో చేరిన గద్దర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తన ఓటు హక్కును ఎప్పుడూ వినియోగించుకోలేదు. అయితే ఈ సారి తెలంగాణా ఎన్నికల్లో ఆయన ప్రజాకూటమి తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అలానే ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఆయన ఓటు వేశారు. అయితే ఓటు వేయడానికి వచ్చిన సమయంలో గద్దర్ చేతిలో అంబేద్కర్ ఫొటో ఉండటం విశేషం.