మౌన దీక్ష బూనిన సిద్దూ

వాస్తవం ప్రతినిధి: రాజకీయవేత్తగా మారిన మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దూ ఇప్పుడు పంజాబ్ డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆయన తన విపరీత ధోరణి తో పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆయన ఏది చేసినా కొంచెం అతిగా ఉంటుంది అన్న ప్రచారం కూడా జరిగిపోతుంది. దాంతోనే ఆయన మరిన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు. టీవీషోల్లో పడీపడీ నవ్వడం, పాకిస్థాన్ సైన్యాధిపతిని కావలించుకోవడం వంటివి అందరికీ తెలిసిందే. ఇటీవల నా కెప్టెన్ ఢిల్లీలో ఉన్న రాహుల్ అని స్టేట్‌మెంట్ ఇస్తే కాంగ్రెస్ అధిష్ఠానం నీ కెప్టెన్ పంజాబ్ సీఎం అమరిందర్ అనేది గుర్తుంచుకో అని వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన అతి వల్ల మరోరకం సమస్య వచ్చిపడింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ తరఫున సిద్ధూ ప్రచారం జరిపేందుకు తెగ ఆయాసపడిపోయారు. పార్టీ జయాపజయాలమాటేమోగానీ ఆయనకు మాత్రం గొంతు పోయిందట. స్వరతంత్రులు దాదాపుగా తెగిపోయాయిట. ఇక గొంతుకు సంపూర్ణ విశ్రాంతి ఇవ్వకపోతే మల్లీ మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చని వైద్యులు గట్టిగా హెచ్చరించడం తో సిద్ధూ మౌనదీక్ష పూని ఇంటిపట్టునే ఉంటున్నారట.