అంబేడ్కర్ కు ఘన నివాళులు అర్పించిన కేటీఆర్,కవిత

వాస్తవం ప్రతినిధి: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కు తెలంగాణా మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత ఘన నివాళులర్పించారు. అంబేడ్కర్ 63వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ కేటీఆర్, కవిత లు ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి, అంటరానితనం, వివక్షలపై అలుపెరగని పోరు చేసిన అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి నివాళులర్పించారు. అంబేడ్కర్ ను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఉద్యమం చేశామని,ఆ మహానీయుడు ఎప్పటికీ అందరికీ ఆదర్శంగా ఉంటారని వారు ట్వీట్ లో పేర్కొన్నారు.