జపాన్ సముద్ర జలాల్లో కూలిన అమెరికా యుద్ద విమానాలు

వాస్తవం ప్రతినిధి: జపాన్‌ తీరంలోని సముద్ర జలాల్లో అమెరికా సైన్యానికి చెందిన రెండు యుద్ధ విమానాలు కూలినట్లు తెలుస్తుంది. అయితే గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఐదుగురు మెరైన్లు( నావికాదళ అధికారులు) గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. శిక్షణలో చోటుచేసుకున్న తప్పిదం కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఎఫ్‌/ఎ18 హర్నేట్‌ యుద్ధ విమానం, కెసి130 హెర్యూలెస్‌ విమానాలు ఫసిఫిక్‌ సముద్రంలో కూలిపోయాయని జపాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఘటనలో ఏడుగురిలో ఇద్దరు మెరైన్లను కనుగొన్నామని తెలిపింది. మిగిలిన ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది.