హువావే ముఖ్య అధికారి అరెస్ట్

వాస్తవం ప్రతినిధి: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ హువావే టెక్నాలజీస్‌ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో)ను కెనడా అధికారులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తుంది.  అమెరికా అభ్యర్ధన మేరకు కెనడియన్‌ అధికారులు హువావే డిప్యూటీ చైర్మన్‌ను అరెస్ట్‌ చేసిందన్న వార్తలు విస్మయానికి గురిచేస్తుంది. అంతేకాదు సీఎఫ్‌వోను త్వరగా అమెరికాకు రప్పించే చర్యలు కూడా ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తుంది. ఇరాన్‌పై అమెరికా విధించే వాణిజ్యపరమైన నిబంధలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈ అరెస్టు చోటు చేసుకుంది.