న్యూ కాలెడోనియా లో 7.5 తీవ్రత తో భారీ భూకంపం

వాస్తవం ప్రతినిధి: పసిఫిక్‌ సముద్రంలోని న్యూ కాలెడోనియా ద్వీప తీరంలో బుధవారం 7.5 తీవ్రత తో భారీ భూకంపం సంభవించినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని అమెరికా భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఆ ప్రాంతంలో సునామీ వచ్చే ప్రమాదం కూడా ఉందని పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించినట్లు తెలుస్తుంది. న్యూ కాలెడోనియా తీరానికి 155 కిలోమీటర్ల దూరంలో కేవలం పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనితో భూకంప కేంద్రానికి వెయ్యి కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే ప్రమాదముందని, న్యూ కాలెడోనియా, వనౌటు తీరాలకు సునామీ ప్రమాదం ఉందని,అలానే న్యూజిలాండ్ లో కూడా సునామీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు  ఫసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. అయితే ఈ భూకంపం కి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.