జెస్సికా ది హత్యే అని తేల్చిన లండన్ పోలీసులు

వాస్తవం ప్రతినిధి: ఈ యేడాది మేలో లండన్‌లో జరిగిన ప్రవాస భారత మహిళ జెస్సికా మృతి చెందిన ఘటన మిస్టరీ వీడింది. ఆమెది హత్య అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఆమెకు ఊపిరాడకుండా చేసి ఆమె భర్తే చంపినట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం… యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో జెస్సికా(34)కు సహావిద్యార్థి మితేశ్‌ పటేల్‌(37)తో వివాహమైంది. వారు లండన్‌లో మెడికల్‌ షాపు నిర్వహిస్తున్నారు. మితేశ్‌ ఒక స్వలింగ సంపర్కుడు. 2015లో సోషల్‌మీడియాలో అమిత్‌పటేల్‌ అనే వ్యక్తితో అతనికి పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత అమిత్‌తో కలిసి మితేశ్‌ ఆస్ట్రేలియాలో స్థిరపడాలనుకున్నాడు. అందుకు అవసరమైన డబ్బుకోసం ఇన్సూరెన్స్‌కు దరఖాస్తు చేయాలని నిశ్చయించుకున్నాడు. అయితే దీనికి తన భార్య అడ్డు గా భావించిన అతడు ఆమెను తొలగించుకుని ఆస్ట్రేలియాకు వెళ్లాలని భావించాడు. దానికి అనుగుణంగా ప్రయత్నాలు ప్రారంభించాడు. భార్యను ఎలా చంపాలని ఇంటర్నెట్‌లో వెతికి, అనంతరం సూపర్‌ మార్కెట్‌లో నుంచి ఒక ప్లాస్టిక్‌ బ్యాగ్‌ను కొని తీసుకుని వచ్చాడు. ఆమె తలకు ప్లాస్టిక్‌ బ్యాగ్‌ తొడిగి ఊపిరి ఆడకుండా చేశాడు. దీంతో ఆమె మరణించింది. కాగా ఈ హత్యకు కారణం అమె భర్తే కారణమని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఈ కేసు బుధవారం కోర్టులో విచారణకు వచ్చింది. నిందితునికి యావజ్జీవ శిక్ష విధించాలనీ కోర్టును ప్రాసిక్యూటర్‌ కోరారు.