తొలి రోజు 250/9 తో భారత్!

వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియా-భారత్ ల మధ్య ఈ రోజు తొలి టెస్ట్ ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత్ కష్టాల్లో పడింది. 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియా ను పుజారా తన బ్యాటింగ్ తో కాస్త ఆదుకున్నాడు.  లైయన్‌ వేసిన 50వ ఓవర్‌ తొలి బంతిని ఎదుర్కొన్న రిషబ్‌ పంత్‌ (25 ; 38 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) పైన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 54 ఓవర్లు ముగిసేసమయానికి భారత్‌ 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అనంతరం పూజారా నిదానంగా స్కోరు చేయడం తో తొలి రోజు భారత్ 9 పరుగుల నష్టానికి 250 పరుగులు చేసింది.  తొలుత 56 ర‌న్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయిన టీంని పూజారా(123 ; 7×4, 2×6) త‌న సెంచ‌రీతో ఆదుకున్నాడు. ఈ సెంచ‌రీతో కెరీర్‌లో 16వ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు పుజారా. లంచ్ త‌ర్వాత రోహిత్ శ‌ర్మ (37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిష‌బ్ పంత్ (25; 2 ఫోర్స్‌, 1 సిక్స్) వంటి టాప్ బ్యాట్స్‌మెన్స్ వికెట్స్ కోల్పోయిన‌ప్ప‌టికి అశ్విన్ ( 25 ; 1×4)తో క‌లిసి స్కోరు బోర్డ్‌ని ప‌రుగులెత్తించాడు. ఈ రోజు ఉద‌యం ఓపెనర్లు కేఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11) మ‌రోసారి నిరాశ ప‌ర‌చ‌గా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (3), అజింక్య రహానె (13) తొంద‌ర‌గానే పెవిలియ‌న్ చేరుకున్నారు.