సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన పాక్ లెగ్ స్పిన్నర్

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ టెస్ట్ క్రికెట్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. అతడు ఎవరో కాదు పాక్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా. అతి త‌క్కువ టెస్టు మ్యాచుల్లో 200 వికెట్లు తీసుకున్న బౌల‌ర్‌గా యాసిర్ రికార్డు నెల‌కొల్పాడు. దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మూడ‌వ టెస్టులో అతడు ఈ ఫీట్‌ను అందుకున్నాడు. దాదాపు 82 ఏళ్ల రికార్డును అత‌ను బ్రేక్ చేశాడు. 33వ టెస్టులోనే 200 వికెట్లు తీసిన ఘ‌న‌త‌ను యాసిర్ సొంతం చేసుకున్నాడు. గ‌తంలో ఆస్ట్రేలియా లెగ్ స్నిన్న‌ర్ క్లేరీ గ్రిమ్మెట్ పేరిట ఉన్న రికార్డ్ ను అధిగమించి యాసిర్ తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇప్ప‌టికే యాసిర్ 27 వికెట్లు తీసుకున్నాడు. ఇవాళ ఉద‌యం కివీస్ ప్లేయ‌ర్ సోమ‌ర్‌విల్లేను ఔట్ చేయ‌డంతో యాసిర్ ఈ రికార్డును చేజిక్కించుకున్నాడు. టెస్టుల్లో అతి త్వ‌ర‌గా 50 వికెట్లు తీసుకున్న బౌల‌ర్‌గా కూడా యాసిర్ పేరిట రికార్డు ఉన్న‌ది.