తొలి టెస్ట్ ప్రారంభం….బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

వాస్తవం ప్రతినిధి: ఆడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నట్లు తెలుస్తుంది.  పిచ్‌పై పచ్చిక ఉండటంతో ముందుగా బ్యాటింగ్‌ చేయడానికే మొగ్గు చూపుతున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు. రోహిత్‌ శర్మ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడని తెలిపాడు. మరోపక్క ముగ్గురు కీలక పేసర్లు, స్పిన్నర్‌ నాథన్‌తో బరిలోకి దిగుతున్న తమ జట్టు భారత్‌ను కట్టడి చేయగలదని ఆసీస్‌ సారథి ఫైన్‌ భావిస్తున్నాడు.