తిత్లీ తుఫాన్ లో దెబ్బ తిన్న ఏపీ కి కేంద్రం రూ.539.53 కోట్లు అదనంగా సాయం

వాస్తవం ప్రతినిధి: ఇటీవల తిత్లీ తుఫాన్‌ భీభత్సం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ ని ఆదుకోవడానికి ఎట్టకేలకు కేంద్రం ముందుకు వచ్చింది. తిత్లీ తుఫాన్‌తో శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిత్లీ తుఫాన్‌ సాయం కింద ఏపీకి రూ.539.53 కోట్లు అదనంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇక, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న కేరళ రాష్ట్రానికి రూ. 3050 కోట్ల అదనపు సాయాన్ని అందజేయనుంది.  ఈ మేరకు ప్రతిపాదనలకు కేంద్ర హోంశాఖ హైలెవల్‌ కమిటీ గురువారం ఆమోదం తెలిపింది.