ఈనెల 11న ప్రారంభమవుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు

వాస్తవం ప్రతినిధి: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 11న ప్రారంభమయ్యే సమావేశాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు (10వ తేదీ) రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అదే రోజున లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆల్ పార్టీ మీటింగ్ ను నిర్వహించనున్నారు. రాజ్యసభ, లోక్ సభ సమావేశాలు సజావుగా కొనసాగేందుకు సహకరించాలంటూ ఈ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల నేతలను వీరు కోరనున్నట్లు సమాచారం.