మహాకూటమి ద్వారానే తెలంగాణ అభివృద్ధి , ప్రజా సంక్షేమం: బాబూ రాజేంద్రప్రసాద్

వాస్తవం ప్రతినిధి: మహాకూటమి ద్వారానే తెలంగాణ అభివృద్ధి , ప్రజా సంక్షేమం జరుగుతుందని ఎమ్మెల్సీ యలమంచిలి వేంకట బాబూ రాజేంద్రప్రసాద్ గారు అన్నారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల మహాకూటమి అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా షేక్ పేట ఏరియాలో ప్రచారంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పీజేఆర్ ఎనలేని కృషి చేశారని, పీజేఆర్ బలహీన వర్గాల పక్షపాతి అని కార్మిక వర్గాలందరు విష్ణువర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడి గెలిపించాలని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు అన్నారు.

తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలను మాయమాటలతో మోసం చేసిన కేసీఆర్ కు , విష్ణువర్ధన్ రెడ్డి గెలుపుతో బుద్ధి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సదానంద్, స్థానిక తెదేపా నాయకులు శంకర్ ప్రసాద్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.