రణబీర్ తో బ్రేక్ తరువాత నేను ఏమిటో నాకు తెలిసింది : కత్రిన కైఫ్

వాస్తవం సినిమా: రణబీర్ కపూర్ కత్రిన కైప్ కొన్ని ఏండ్లుగా డేటింగ్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. 2016 లో వీరిద్దరు తమ డేటింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టారు ఈ విషయాన్ని రణబీర్ కపూర్ చాలా సార్లు ద్రువీకరించాడు కూడా. కానీ కత్రిన మాత్రం ఈ విషయం పైన నోరు మెదపడం లేదు. తాజాగా ఈ విషయం పైన కత్రిన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కొన్ని అనుభవమైన విషయాలను వెల్లడించింది.
రణబీర్ తో బ్రేక్ తరువాత నేను ఏమిటో నాకు తెలిసింది అప్పటివరకు నా గురించి నాకు తెలియదు. మనం ప్రతి విషయంలోనూ చాలా జాగ్రతగా ఉండాలి. మన గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించుకో అప్పుడు నీకు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. అని వేదాంతం చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం కత్రిన భారత్ అనే సినిమాలో నటిస్తుంది. వచ్చే నెల డిసెంబర్ 21 న కత్రిన జీరో మూవీ విడుదలకు సిద్దం అవ్వుతుంది ఈ చిత్రాన్ని ఆనంద్ యల్ రాయ్ దర్శకత్వం వహించాడు.