ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సంపాదించుకున్న యంగ్ హీరో

వాస్తవం సినిమా: “అర్జున్‌ రెడ్డి” సినిమాతో టాలీవుడ్‌ లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ. తరువాత కూడా గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో అదే జోరు కంటిన్యూ చేస్తున్న విజయ్‌ తాజాగా ఫోర్బ్స్‌ జాబితాలోనూ చోటు సంపాదించుకున్నాడు. ఈ ఏడాది స్టార్ స్టేటస్ ను అందుకోవడమే కాదు .. ఆదాయ పరంగా కూడా మెరుగైన స్థానానికి చేరుకున్నాడు. ఈ కారణంగానే ఫోర్బ్స్ జాబితాలో ఆయనకి స్థానం లభించింది. 2018లో అత్యధిక ఆదాయాన్ని పొందిన టాప్ 100 సెలబ్రిటీస్ లిస్ట్ లోకి విజయ్ దేవరకొండ చేరిపోయి రేర్ ఫీట్ ను సాధించాడు. కెరియర్లో తొలిసారిగా విజయ్ దేవరకొండ పేరు ఫోర్బ్స్ జాబితాలో ప్రత్యక్షమైంది.

ఇంత తక్కువ కాలంలో ఫోర్బ్స్‌జాబితాలో స్థానం సంపాదించడం కూడా ఓ రికార్డ్‌గానే చెపుతున్నారు ఫ్యాన్స్‌. ఈ లిస్ట్ సౌత్‌ నుంచి అగ్రస్థానంలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నిలవగా పవన్‌ కల్యాణ్‌, విజయ్‌, ఎన్టీఆర్‌, విక్రమ్‌, మహేష్‌ బాబు, సూర్య, విజయ్‌ సేతుపలి లాంటి తారలు ఉన్నారు.