పిచ్చిపిచ్చి ఆటలు ఆడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు..ఖబడ్దార్!: చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: ఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, సూర్యాపేట జిల్లా కోదాడలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్‌కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులను, అధికారులను కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటోందో ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. పిచ్చిపిచ్చి ఆటలు ఆడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఖబడ్దార్ అని హెచ్చరించారు. కేసీఆర్‌ది అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకమన్నారు. తెలంగాణ ప్రజల కోసమే తానిక్కడకు వచ్చానని, కాంగ్రెస్ వ్యక్తే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పెద్ద నియంత అయితే, కేసీఆర్ చిన్న నియంత అని అన్నారు. టీఆర్ఎస్‌కు ఇవే చివరి ఎన్నికలని, 11 తర్వాత కేసీఆర్ మాజీ అవుతారని పేర్కొన్నారు. ప్రజాఫ్రంట్ అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.