సంచలనాలు సృష్టించడం శంకర్ కి కొత్తకాదుగా..

వాస్తవం సినిమా: సంచలనాలు సృష్టించడం శంకర్ కి కొత్తకాదు .. సంచలన విజయాలను అందుకోవడం రజనీకి కొత్తకాదు. అయితే ఈ సారికి ఈ ఇద్దరూ తమ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో ‘2.ఓ’ సినిమా చేశారు. ఒక రకంగా నిర్మాతలకి ఇది అతిపెద్ద సాహసమే. అయినా అంతా కలిసి కథాకథనాలు .. వాటికి బలాన్ని చేకూర్చే గ్రాఫిక్స్ .. వాటిపై పూర్తి అవగాహన కలిగిన శంకర్ ఆలోచనలపై నమ్మకంతో రంగంలోకి దిగారు.

విడుదలైన తొలి రోజునే ఈ సినిమా 100 కోట్లను వసూలు చేసి కొత్త రికార్డును సృష్టించింది. వీకెండ్ వరకూ వసూళ్లు నిలకడగా కొనసాగాయి. తెలుగు .. తమిళ.. హిందీ భాషల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఫలితంగా ఈ సినిమా 4 రోజుల్లోనే 400 కోట్లకి పైగా వసూలు చేసింది. 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, 4 రోజుల్లోనే 400 కోట్ల గ్రాస్ ను రాబట్టడం సంచలనమే. ఇది మెగా బ్లాక్ బస్టర్ గా చెప్పుకుంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.