‘అంతరిక్షం’ లో క్యూట్ లవ్ స్టోరీ

వాస్తవం సినిమా: వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అంతరిక్షం’. స్పేస్ సెంటర్ నేపథ్యంలో ఇప్పటి వరకు ఇండియాలో సినిమా రాలేదు. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న మొదటి సినిమాగా ఇది నిలువబోతుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కు జోడీగా లావణ్య త్రిపాఠి మరియు అదితి రావు హైందేరి నటిస్తున్న విషయం తెల్సిందే. సంకల్ప్ రెడ్డి గత చిత్రం ‘ఘాజీ’లో లవ్ స్టోరీ లేక పోవడంతో కమర్షియల్ గా ఆకట్టుకోలేక పోయిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ఈసారి తన సినిమాలో లవ్ స్టోరీని చూపించబోతున్నాడు. వరుణ్ – లావణ్య త్రిపాఠిల మద్య క్యూట్ లవ్ స్టోరీ ఉండబోతుందని తాజాగా విడుదలైన సమయమా.. పాటతో వెళ్లడయ్యింది. పాటలోని విజువల్స్ చాలా రొమాంటిక్ గా ఉన్నాయి. లావణ్య చీర కట్టులో చాలా పద్దతిగా అందంగా కనిపిస్తుంది.